తల్లితో సంబంధం.. కుమార్తెతో పెళ్లి | Woman Arrest FornicationRelation With Sun In Law in Tamil Nadu | Sakshi
Sakshi News home page

తల్లితో సంబంధం.. కుమార్తెతో పెళ్లి

Jun 7 2018 8:37 AM | Updated on Jun 7 2018 9:05 AM

Woman Arrest FornicationRelation With Sun In Law in Tamil Nadu - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చెన్నై: వివాహేతర సంబంధాన్ని కొనసాగించేందుకు ఓ తల్లి కుమార్తెను ప్రియుడికి ఇచ్చి వివాహం జరిపించింది. ఈ వ్యవహారంలో కుమార్తెకు హత్యా బెదిరింపులు అందడంతో మంగళవారం పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించింది. వివరాలు.. తమిళనాడు అరియలూరు జిల్లా, జయంకొండాం సమీపం వడకడల్‌ గ్రామానికి చెందిన మహిళ (45) ఇదే ప్రాంతానికి చెందిన బిచ్చై కుమారుడు, కార్మికుడు రాజు (21)తో మహిళకు వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో ఆమె కుమార్తెతో కూడా రాజు పరిచయం పెంచుకుని ఆమెతోనూ వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. దీంతో కూతురు గర్భవతి అయింది. ఈ విషయం తెలుసుకున్న మహిళ కుమార్తెను రాజుకు ఇచ్చి వివాహం జరిపేందుకు నిర్ణయించింది. 

రాజుతో తన సంబంధాన్ని కొనసాగించవచ్చని భావించింది. ఈ విషయాన్ని దాచిపెట్టి రాజుకు 2016లో కూతురిని ఇచ్చి వివాహం జరిపించింది. కుమార్తెను రాజుకు ఇచ్చి వివాహం జరిపించినా మహిళ రాజుతో తన సంబంధాన్ని తెంచుకోలేదు. కుమార్తె లేని సమయంలో ఆమె రాజుతో గడిపేది. ఆరు నెలల క్రితం రాజు, తల్లి చనువుగా ఉండడం చూసి కుమార్తె హతాశురాలైంది. వెంటనే తల్లి, భర్తలను నిలదీసింది. దీంతో వారు ఆమెపై దాడి జరిపి హింసించడమే కాకుండా చంపుతామని బెదిరించారు.

ఇలావుండగా యువతి తన తల్లి నుంచి భర్తను విడిపించుకోవాలని నిర్ణయించింది. వడకడల్‌లో ఇంటిని ఖాళీ చేసి తంజైకు భర్తను తీసుకెళ్లి కాపురం పెట్టింది. అక్రమ సంబంధానికి అడ్డుకట్ట వేయడంతో రాజు కోపోద్రిక్తుడయ్యాడు. దీంతో దంపతుల మధ్య గొడవలు జరిగేవి. ఈ విషయాలన్నీ తండ్రి పాండియన్‌కు బాధితురాలు తెలిపింది. పాండియన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడం‍తో ఎస్‌ఐ సెల్వకుమారి విచారణ జరిపి రాజు, యువతి తల్లిని అరెస్ట్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement