దారుణం: భర్త వేధింపులు భరించలేక...

Wife Chopped Off Husbands Head In Ukrainian Over Domestic Abuse - Sakshi

కీవ్‌/ఉక్రేయిన్‌ : నైట్‌ షిఫ్టు ముగించుకుని ఇంటికి వచ్చిన 49 ఏళ్ల అలెగ్జాండర్‌ మంచంపై గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. ఇంతలో మంచం దగ్గరకు వచ్చింది అతడి భార్య మారియా. మంచంపై ప్రశాంతంగా నిద్రపోతున్న అలెగ్జాండర్‌ను చూడగానే ఆమె ముఖం ఎర్రగా మారిపోయింది. పట్టలేని ఆగ్రహంతో అతడి గొంతును రెండు చేతుల్తో బలంగా నొక్కిపట్టి చంపేసింది. అంతటితో ఆమె కోపం తగ్గలేదు. వంట గదిలోకి వెళ్లిన ఆమె పదునైన కత్తితో అక్కడికి తిరిగొచ్చింది. అతడి తలను శరీరం నుంచి వేరుచేసి ఓ సంచిలో పడేసింది.

భర్త మర్మాంగాన్ని కోసి, దాన్ని అక్కడే ఉన్న పెంపుడు కుక్కకు ఆహారంగా పడేసింది. అతడి శరీరాన్ని ముక్కలుగా కోసి కనిపించకుండా చేయాలనుకుంది. కానీ, ఆమెకది తలకుమించిన పనిగా మారింది. దీంతో ఇంట్లోంచి బయటకు పరిగెత్తింది. ఇంటి పక్కనే ఉంటున్న నజేద ఒపనస్యుక్‌ అనే మహిళ మారియాను చూసింది. మారియా చేతుల నిండా రక్తం, బట్టలు కూడా రక్తంతో తడిసి ఎర్రగా ఉండటంతో ‘‘ ఏమైంది’’ అని ఆదుర్ధాగా అడిగింది. ‘‘ నేను సమస్యలో ఉన్నాను. నా భర్తను చంపేశాను’’ చెప్పింది మారియా.

అయితే మారియా మాటలు నజేద నమ్మలేదు. భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారేమోనని అనుమానించిన ఆమె వెంటనే మారియా ఇంట్లోకి వెళ్లిచూసింది. అక్కడ రక్తపు మడుగుల్లో తల లేకుండా పడి ఉన్న అలెగ్జాండర్‌ను చూసి ఆమె గుండె ఆగినంతపనైంది. వెంటనే మారియా దగ్గరకు తిరిగొచ్చి‘‘ నీ భర్త తల ఎక్కడ?’’ అని అడిగింది. ‘‘ అక్కడే ఉన్న సంచిలో ఉంది’’  మారియా సమాధాన మిచ్చింది. దీంతో మారియానే అలెగ్జాండర్‌ను హత్య చేసిందని గుర్తించిన నజేద.. ఇంటి చుట్టుపక్కల వారికి విషయం చెప్పి పోలీసులకు సమాచారమిచ్చింది.

అక్కడకు చేరుకున్న పోలీసులు మారియాను అదుపులో​కి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పోలీసుల విచారణలో మారియా చేసిన నేరాన్ని అంగీకరించింది. గత కొన్ని సంవత్సరాలుగా భర్త పెడుతున్న మానసిక, శారీరక వేధింపులను భరించలేకే భర్తను హత్యచేసినట్లు తెలిపింది. కాగా, మారియా భర్త ఆమెను చాలా సార్లు తీవ్రంగా కొట్టడం తాము చూశామని, పలుమార్లు కత్తితో వెంటపడ్డాడని అలెగ్జాండర్‌ ఇంటి చుట్టుపక్కలి వారు పోలీసులకు వివరించారు. ఉక్రేయిన్‌లోని ఒబరివ్‌కు సమీపంలో గల ఓ గ్రామంలో ఆగస్టు 23న చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
చదవండి : గ్లాసు బీరుకు ఎంత చెల్లించాడో తెలిస్తే షాక్‌ అవుతారు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top