గ్లాసు బీరుకు ఎంత చెల్లించాడో తెలిస్తే షాక్‌ అవుతారు

Australia Man Paid 99 Dollars For Pint Of Beer - Sakshi

కాన్‌బెర్రా : ఓ వ్యక్తి గ్లాసుడు బీరు కోసం చెల్లించిన మొత్తం ఎంతో తెలిస్తే మీరు కచ్చితంగా షాక్‌ అవుతారు. అంత చెల్లించాడా? అంటూ నోరెళ్ల బెడతారు. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాకు చెందిన పీటర్‌ లాలర్‌ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం మాల్‌మేసన్‌ అనే హోటల్‌కు వెళ్లాడు. అక్కడ అమెరికన్‌ది కాకుండా బ్రిటీష్‌ బీరు ఆర్డర్‌ చేశాడు. డ్రింక్‌ను ఎంజాయ్‌ చేస్తూ తాగాడు. కార్డుతో డబ్బులు కట్టేశాడు. బీరుకు ఎంత డబ్బులు చెల్లించానో తెలుసుకోవాలనుకున్న పీటర్‌ హోటల్‌ సిబ్బందిని అడిగాడు. పీటర్‌ చెల్లించిన మొత్తం ఎంతో చెప్పడానికి సిబ్బంది తటపటాయించాడు. పీటర్‌ గట్టిగా అడిగేసరికి బిల్‌ ఎంతో చెప్పాడు. అంతే! పీటర్‌ షాక్‌ తిన్నాడు. తాను ఒక గ్లాసు బీరుకోసం దాదాపు రూ. 70 లక్షలు చెల్లించానని తెలిసి నోరెళ్లబెట్టాడు.

అయితే మొదట అతడికి నమ్మకం కుదురలేదు. ఇంటి వద్దనుంచి ఫోన్‌ రావటంతో అది వాస్తవమేనని అతడు ధ్రువీకరించుకున్నాడు. దీనిపై పీటర్‌ మాట్లాడుతూ.. ‘‘ చరిత్రలో అత్యంత ఖరీదైన బీరు. దీని కోసం నేను నిజంగానే 99 వేల డాలర్లు చెల్లించాను’’ అంటూ వాపోయాడు. కాగా, హోటల్‌ సిబ్బంది పొరపాటు వల్లే బిల్‌ ఎక్కువగా వేసినట్లు తేలటంతో సదరు డబ్బు మొత్తాన్ని వెనక్కు ఇచ్చేందుకు యాజమాన్యం సమ్మతించింది. జరిగిన పొరపాటుకు చింతిస్తూ పీటర్‌కు క్షమాపణలు చెప్పింది. వసూలు చేసిన డబ్బును వీలైనంత త్వరగా వెనక్కు ఇచ్చే ఏర్పాటు చేస్తామని తెలిపింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top