మహిళపై అత్యాచారం

Watchman Raped On Woman With Friends In Chennai - Sakshi

టీ.నగర్‌: చెన్నై టీ.నగర్‌లో సోమవారం అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి మహిళపై స్నేహితులతో కలిసి అత్యాచారం జరిపిన నేపాలి వాచ్‌మెన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నేపాల్‌ దేశానికి చెందిన వ్యక్తి (29) టీ.నగర్‌ సౌత్‌బోగ్‌ రోడ్డులో అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌. ఇతనికి భార్య (25), ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాచ్‌మన్‌ కావడంతో వ్యక్తి అదే అపార్ట్‌మెంట్‌లో మూడో అంతస్తులో ఇల్లు కేటాయించారు. పగలు అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా, రాత్రి సమీపంలోని ప్రైవేటు సంస్థలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు.త్వ్యక్తిబంధువైన నేపాల్‌ దేశానికి చెందిన వినోద్‌ (28) అతని పక్కనున్న భవనంలో వాచ్‌మన్‌.

ఇదిలాఉండగా బాధిత వ్యక్తి సోమవారం రాత్రి ప్రైవేటు సంస్థలో పనికి వెళ్లాడు. ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ సమయంలో వినోద్‌ స్నేహితులు అరుణ్‌కుమార్, జయచంద్రన్‌తో కలిసి ఇంటి డాబాపై మద్యం తాగారు. అనంతరం ముగ్గురు బాధిత వ్యక్తి ఇంటికి వెళ్లి తలుపు తట్టారు. భర్త వచ్చి ఉంటాడని భావించి భార్య తలుపు తీసింది. ముగ్గురు ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారానికి యత్నించారు. అమె గట్టిగా కేకలు వేయడంతో ఆగ్రహించి నిద్రిస్తున్న బిడ్డలను హతమారుస్తానని బెదిరించి ముగ్గురు అత్యాచారానికి  పాల్పడ్డారు. భర్త వచ్చిన తరువాత బాధితురాలు జరిగిన విషయం చెప్పింది. దీనిపై  భార్యతో కలిసి మాంబళం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వినోద్‌ను అరెస్టు చేసి కేసు విచారణ చేస్తున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top