డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి | Two Thugs Attack On Constable In Hyderabad | Sakshi
Sakshi News home page

డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి

Apr 4 2020 8:47 PM | Updated on Apr 4 2020 8:53 PM

Two Thugs Attack On Constable In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని చంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్‌ అనే కానిస్టేబుల్‌పై ఇద్దరు గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. బైక్‌పై రాంగ్‌ రూట్‌లో వచ్చిన ఇద్దరు దుండగులు కర్రలతో కానిస్టేబుల్‌పై దాడికి దిగారు. ఈ ఘటనలో ప్రవీణ్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటను స్థలానికి చేరుకొని కానిస్టేబుల్‌ను హుటాహుటిన డి‌ఆర్డీఏ ఆపోలో ఆసుపత్రికి తరలించారు. ఫలక్‌నుమా ఏసీపీ మజీద్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. దాడి చేసిన వ్యక్తులు ఎవరు..? ఎందుకు దాడిచేశారు..? రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారని ప్రశ్నించినందుకు దాడి చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement