స్వలింగ సంపర్కం : ఇద్దరు మహిళలకు శిక్ష | Two Muslim Women Whipped In Malaysia For Conviction In Lesbian Acts | Sakshi
Sakshi News home page

Aug 14 2018 5:14 PM | Updated on Oct 16 2018 5:59 PM

Two Muslim Women Whipped In Malaysia For Conviction In Lesbian Acts - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

న్యాయమూర్తి ఆదేశాలతో కోర్టు ఆవరణలోనే స్వలింగ సంపర్కానికి పాల్పడిన ఇద్దరు మహిళల్ని..

కౌలలంపూర్‌ : స్వలింగ సంపర్కం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ముస్లిం మహిళలను మలేషియాలోని ఓ కోర్టు దోషులుగా తేల్చింది. ఒక్కొక్కరికి ఆరు కొరడా దెబ్బలు, 56 వేల రూపాయల చొప్పున జరిమానా విధించింది. న్యాయమూర్తి ఆదేశాలతో కోర్టు ఆవరణలోనే వారిని  కొరడాతో దండించారు. ఈ ఘటన తెరంగను రాష్ర్టంలో మంగళవారం చోటుచేసుకుంది. 32, 22 ఏళ్ల వయసున్న ఇద్దరు మహిళలు గత ఏప్రిల్‌లో స్వలింగ సంపర్కానికి ఒడిగట్టారని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ముహమద్‌ ఖాస్మీజాన్‌ అబ్దుల్లా మీడియాకు వెల్లడించారు. షరియా చట్టాల ప్రకారం స్వలింగ సంపర్కం నేరమని తెలిపారు.

స్వలింగ సంపర్కానికి సంబంధించి తెరంగను రాష్ర్టంలో ఇదే తొలి తీర్పు అని తెలిపారు. కాగా, ఈ తీర్పుపై మలేషియాలోని ఎల్‌జీబీటీ కమ్యూనిటీ నుంచి తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఇలాంటివి గతంలో చోటుచేసుకున్నా ఎవర్నీ దోషులుగా తేల్చలేదని తిలగా సులాతిరే అనే హక్కుల కార్యకర్త కోర్టు తీర్పుపై మండిపడుతున్నారు. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడం ఎల్‌జీబీటీ కమ్యూనిటీపై వివక్ష చూపుతున్నారడానికి నిదర్శనమని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement