టీటీడీపై దుష్ప్రచారం చేసిన వారిపై కేసులు

Tirumala Police have filed cases against several people who have fake Propaganda on TTD - Sakshi

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానాలపై దుష్ప్రచారం చేసి, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిన పలువురిపై టీటీడీ చేసిన ఫిర్యాదుల మేరకు తిరుమల టూటౌన్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. 

► టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యత్వానికి సుధా నారాయణమూర్తి రాజీనామా చేశారని ఫేస్‌బుక్‌లో అసత్య ప్రచారం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
► తిరుమలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, భక్తులు తిరుమలకు వెళ్లకూడదని తమిళ నటుడు శివకుమార్‌ ప్రచారం చేశారని తమిళ్‌మయ్యన్‌ అనే వ్యక్తి ఈ–మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేయగా అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
► తిరుమల శ్రీవారి ఆలయంలో 30–6–2020 వరకు భక్తులకు దర్శనం నిలిపివేస్తారంటూ మాచర్ల శ్రీనివాసులు, ప్రశాంత్, ముంగర శివరాజు, way2news short  news App  నిర్వాహకులు తిరుపతి వార్త, గోదావరి న్యూస్‌ వాట్సాప్‌ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం చేసినందుకు ఎపిడమిక్‌ డిసీసెస్‌ యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు.
https://www.face book.com/atheisttelugu/ అనే ఫేస్‌బుక్‌ పేజీలో 7–5–2020న తిరుమల శ్రీవారిపై అవాస్తవ సమాచారాన్ని పోస్టు చేశారు. ఒకానొక కాలంలో తిరుమల ఆలయం బౌద్ధారామం అని, తలనీలాల సమర్పణ హిందువుల సంప్రదాయం కాదని బౌద్ధులకు చెందిందని అందులో పేర్కొన్నారు. తిరుమల ఆలయంలో ఉన్న బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసి శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహంగా మార్చారని పొందుపరిచారు. ఈ పోస్టులో బుద్ధుని చిత్రం, బుద్ధుడి నుంచి శ్రీవేంకటేశ్వర స్వామివారిగా మార్చిన చిత్రం ఉన్నాయి. ఈ పోస్టు పెట్టిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top