సంగారెడ్డిలో బాలికపై దారుణం

సాక్షి, సంగారెడ్డి : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ ఘటన మరవక ముందే మరో అత్యాచార ఘటన చేటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వాణినగర్‌లో 16 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన ఆగంతకులు అత్యంత దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ మేరకు బాధితురాలు గురువారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొంత కాలంగా సదరు బాలిక తల్లిందుడ్రులు అమీన్‌పూర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో సెక్యూరిటీ సిబ్బందిగా పని చేస్తున్నారు. అయితే గురువారం మధ్యాహ్న సమయంలో ఇంటి నుంచి షాప్‌కి వెళ్లిన బాలికను ముగ్గురు ఆగంతకులు కారులో వచ్చి సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్ద అడ్డగించారు. అనంతరం నోరు మూసి కారులో బలవంతంగా లాక్కెళ్లి.. దారుణానికి ఒడిగట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకున్నారు. బాలికకు సంబంధించిన కొన్ని వస్తువులను సంఘటన స్థలంలో స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలంలో మద్యం బాటిల్స్ కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి