ఒక్కరోజు.. మూడు అత్యాచారాలు | three minors raped in separate incidents in UP | Sakshi
Sakshi News home page

ఒక్కరోజు.. మూడు అత్యాచారాలు

Dec 26 2017 6:40 PM | Updated on Jul 28 2018 8:44 PM

three minors raped in separate incidents in UP - Sakshi

సాక్షి, లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో మహిళలకు, బాలికలకు ఏ మాత్రం రక్షణ లేదని మరోసారి రుజువైంది. రాష్ట్రంలోని ముజఫరాబాద్‌, ప్రతాప్‌గఢ్‌, బండా జిల్లాల్లో మంగళవారం నాడు నలుగురు మైనర్‌ బాలికలపై గ్యాంగ్‌రేప్‌ జరిగినట్లు పోలీసులు తెలిపారు.  ప్రతాప్‌ గఢ్‌ జిల్లాలో కేవలం ఆరేళ్ల బాలికపై మృగాళ్లు అత్యంత కిరాతకంగా అత్యాచారం జరిపారు. తల్లిదండ్రులు పొలం పనులకు బయటకు వెళ్లిన సమయంలో.. ఇద్దరు మృగాళ్లు బాలికపై పడి.. నీచంగా అత్యాచారం జరిపారు. 

బండా జిల్లాలోని ఐదేళ్ల చిన్నారిపై మామ ఓం ప్రకాశ్‌ అత్యంత కౄరంగా అత్యాచారం జరిపాడు. నిందితుడిపై బాలిక తల్లిదండ్రులు కేసు పెట్టారు. ఇదిలా ఉండగా.. ఓం ప్రకాశ్‌.. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కేసును రిజిస్టర్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ముజఫర్‌నగర్‌లోని నాగాల బుజరంగ్‌ గ్రామంలో.. 15 ఏళ్ల యువతిని తుపాకితో బెదిరించి ఇద్దరు యువకులు అత్యాచారం జరిపారు. పోమవారం నాడు ఇద్దరు యువకులు రహస్యంగా ఇం‍ట్లోకి ప్రవేశించి ఎవరూ లేని సమయంలో.. యువతిని భయపెట్టి అత్యాచారం చేసినట్లు బాధితురాలి తండ్రి పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు యువకులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement