
పోలీసులు స్వాధీనం చేసుకున్న పంచలోహ విగ్రహాలు
జగిత్యాలక్రైం: పంచలోహ విగ్రహాల దొంగలను జిల్లా కేంద్రంలో పట్టణ పోలీసులు శని వారం అదుపులోకి తీసుకున్నారు. గాంధీనగర్, తాటిపల్లి, ధరూర్‌కు చెందిన ముగ్గురు యువకులు కలిసి కోరుట్లలోని పలు ఆలయాల్లో ఐదు పంచలోహ విగ్రహాలను దొంగిలించారు. వాటిని గాంధీనగర్‌లో దాచిపెట్టారు.
విగ్రహాలను శనివారం భూమిలో పాతిపెట్టేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. విగ్రహాలు ఏ ఆలయాలకు చెందినవనే కోణంలో విచారణ చేస్తున్నారు.