మిత్రుడిని మోసగించి చోరీ

హైదరాబాద్‌: మిత్రుడి ఇంట్లో చోరీ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ముషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. విజయ్‌, శ్రీనివాసచారి చిన్ననాటి మిత్రులు. విజయ్‌ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఈ క్రమంలో శ్రీనివాసచారిని మోసగించి అతని ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. ఈ కేసులో అతడిని అరెస్టు చేసి 50 తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయ్‌ను రిమాండ్‌కు తరలించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top