ఆధార్‌ ఇవ్వలేదని 10 ఏళ్ల బాలుడిపై దారుణం

Ten-year-old brutally beaten up by school teacher for not submitting Aadhaar

పుణే : ఆధార్‌ వివరాలు ఇవ్వలేదని 10 ఏళ్ల విద్యార్థిని ఓ టీచర్‌ దారుణంగా కొట్టిన ఘటన చిన్‌చ్వాడ్‌ ప్రాంతంలో మోర్య శిక్షణ్‌ సంస్థాలో చోటుచేసుకుంది. గత కొన్ని వారాల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సర్జరీ అనంతరం ఆ బాలుడి జరిగిన ఘటనంతా వివరించడంతో, విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు చిన్‌చ్వాడ్‌ పోలీసు స్టేషన్‌లో టీచర్‌పై కేసు నమోదైంది.  ఆధార్‌ వివరాలు ఇవ్వలేదని తమ కొడుకును టీచర్‌ ఎందుకు ఇంతలా కొట్టిందో తనకు అర్థం కావడం లేదని విద్యార్థి తల్లి సంగీత బెల్లె అన్నారు. తనకున్న జ్ఞానం ప్రకారం సర్క్యూలర్లు, ఇతర నోటిఫికేషన్లను తల్లిదండ్రులకు పంపించడానికి ఓ మొబైల్‌ అప్లికేషన్‌ను అందించాలని స్కూల్‌ యాజమాన్యం ప్లాన్‌ చేసిందని, దానికి ఆధార్‌ వివరాలు అవసరమని ఆమె పేర్కొన్నారు. కానీ ఆధార్‌ వివరాలు ఇవ్వనందుకే కొట్టాల్సినంత అవసరం లేదన్నారు. 

సర్జరీ నిమిత్తం అక్టోబర్‌ 6 నుంచి అక్టోబర్‌ 15 వరకు తమ కొడుకును ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించినట్టు తల్లిదండ్రులు చెప్పారు. జరిగిన ఘటన చెప్పడానికి కూడా తాను చాలా భయపడ్డాడని, మోకాళ్లకు బాగా దెబ్బలు తగలడంతో నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాడని వివరించారు. సర్జరీ చేయించడానికి ఆసుపత్రిలో జాయిన్‌ చేసినప్పుడు, జరిగిన ఘటనంతా వివరించాడని బెల్లె తెలిపారు. తమ కొడుకు ఆసుపత్రి నుంచి డిఛార్జ్‌ చేశాక, వీరు పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించి, టీచర్‌పై ఫిర్యాదు చేశారు. ప్రమాదకరమైన ఆయుధాలతో గాయపరిచినందుకు గాను టీచర్‌పై సెక్షన్‌ 324 కింద, జువెలియన్‌ సెక్షన్‌ యాక్ట్‌ 2015లో సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఆదివారం స్కూల్‌కు సెలవు కావడంతో, సోమవారం స్కూల్‌ అథారిటీని సంప్రదించి, ఈ కేసుపై మరిన్ని వివరాలు రాబడతామనని చిన్‌చ్వాడ్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారులు చెప్పారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top