కోర్టులో లొంగిపోయిన అచ్చెన్నాయుడు

TDP Leader Achem Naidu Surrender in Mangalagiri Court  - Sakshi

సాక్షి, అమరావతి: మాజీమంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. పోలీసులను దుర్భాషలాడిన కేసులో ఆయనపై కేసు నమోదు అయిన విషయంతెలిసిందే. అయితే హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్‌ పొందిన అచ్చెన్నాయుడు న్యాయస్థానం సూచనల మేరకు పూచీకత్తు సమర్పించేందుకు మంగళగిరి కోర్టుకు హాజరు అయ్యారు. రూ.50వేల పూచికత్తుతో అచ్చెన్నాయుడుకు మంగళగిరి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. కాగా ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టేందుకే కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. 

ఈ ఏడాది సెప్టెంబర్‌లో  ‘చలో ఆత్మకూరు’ పిలుపు సందర్భంగా  రెచ్చిపోయిన ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు.. ‘ఏయ్‌ ఎగస్టా చేయొద్దు. నన్ను ఆపడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు’ అంటూ పోలీసులను దూషించారు. ఎస్పీ విక్రాంత్ పటేల్‌ను ‘యుజ్‌లెస్ ఫెలో’ అని తిట్టారు. పోలీసులు ఆపుతున్నా వినకుండా తోసుకుంటూ ముందుకు సాగిపోయారు. దీంతో ఆయనపై కేసు నమోదు అయింది.

చదవండిరెచ్చిపోయిన అచ్చెన్నాయుడు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top