
తనిఖీ చేస్తున్న టాస్క్‌ఫోర్స్ అధికారులు
కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌లోని సినిమా థియేటర్లలో తినుబండారాలను అధికధరలకు విక్రయిస్తున్నారన్న సమాచారంతో మంగళవారం పలు థియేటర్లపై టాస్క్‌ఫోర్స్, తూనికల కొలతల అధికారులు దాడులు చేశారు. వేంకటేశ్వర, మమత, సాయికృష్ణ థియేరట్ల లో కూల్‌డ్రింక్ రూ.20 ఉండగా రూ. 25 నుంచి 30కి, తినుబండ రాలు రూ. 5 నుంచి రూ.10 అదనంగా విక్రయిస్తున్నారని గుర్తించారు. క్యాంటీన్ నిర్వహకుల పై కేసు నమో దు చేశారు. మొదటి తప్పుగా ఒక్కోక్యాంటీన్‌కు రూ. 5 వేల జరిమానా విధించారు.
పునరావృతమైతే సీజ్
థియేటర్లలో అధిక ధరలకు విక్రయాలు చేయడమే కాకుండా కొన్ని చోట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదులు అందాయని, మొదటిసారి జరిమానా విధించామని టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ఇది పునరావృ తం అయితే క్యాంటీన్లు సీజ్ చేసి, చట్టరీత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టాస్క్‌ఫోర్స్ సీఐలు శ్రీనివాసరావు, మాధవి, కిరణ్, ఎస్సై రమేశ్, తూనికల కొలతల అధికారి విజయకుమార్ ఉన్నారు.