క్రికెట్‌లో విషాదం

Student Died In Street Cricket Game - Sakshi

యువకుడి మృతి

టీ.నగర్‌: క్రికెట్‌ ఆడుతూ రాయి తగలడంతో కిందపడి విద్యార్థి మృతి చెందాడు. ప్లస్‌టూ పరీక్షలో ఇతను 1,128 మార్కులు సాధించినప్పటికీ అకాలమరణం పొందడంతో తల్లిదండ్రులు ఆవేదనకు గురయ్యారు. కోయంబత్తూరు జిల్లా, అన్నూరు సమీపం మసగౌండన్‌ చెట్టిపాళయంకు చెందిన మోహన్‌రాజ్‌ పాలవ్యాపారి.

ఇతని కుమారుడు సూర్య (18) అన్నూరు–కోవై రోడ్డులోని ప్రైవేటు మెట్రిక్‌ పాఠశాల్లో ప్లస్‌టూ చదివి పబ్లిక్‌ పరీక్ష రాశాడు. బుధవారం పరీక్షా ఫలితాలు వెల్లడి కాగా సూర్య 1,128 మార్కులు పొందాడు. ఈ సంతోషాన్ని స్నేహితులతో పంచుకునేందుకు వెళ్లిన సూర్య అనంతరం అక్కడున్న మైదానంలో క్రికెట్‌ ఆడాడు. ఆ సమయంలో రాయి తగిలి కిందపడ్డాడు. అతన్ని వెంటనే స్నేహితులు కోవిల్‌పాళయం ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top