
తిరువొత్తియూరు: చెన్నై వేప్పేరిలోని ఈ.వి.కె.సంపత్ రోడ్డులో కమిషనర్ కార్యాలయం పక్కన ఉన్న అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న యువకుడు దర్శన్(26). ఇతను చెన్నై ప్యారిస్‌లో హార్డ్‌వేర్ డీలర్‌షిప్ వ్యాపారం చేస్తున్నాడు. ప్రేమ ఇతనికి, రాయపురం పుదుమనైకుప్పం కల్మండపం రోడ్డు ప్రాంతంలో నివశిస్తున్న 25 ఏళ్ల హర్షిదా అనే యువతికి పరిచయం ఏర్పడి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. వివాహం చేసుకోకుండానే ఇద్దరూ గత 1 1/2 సంవత్సరాలుగా భార్యాభర్తల్లా కాపురం ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరూ చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీని తర్వాత అన్నానగర్‌లోని ఒక హోటల్‌లో ఇరు కుటుంబాల సమ్మతితో నిశ్చితార్థం జరిగింది.
హర్షిదా దివ్యాంగురాలు. చిన్నప్పటి నుంచి ఎడమ కాలు బలహీనంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇరు కుటుంబాలు నిశ్చితార్థం, పెళ్లి ఏర్పాట్లు చేశాయి. గత ఫిబ్రవరి 12న నిశ్చితార్థం ముగిసిన తర్వాత దర్శన్, హాసిద ఎప్పటిలాగే మాట్లాడుకుంటూ కలిసి తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఒక వారం క్రితం దర్శన్ హర్షిదకు ఫోన్ చేసి ‘నీ క్యారెక్టర్ బాగోలేదు. నువ్వు నాకు వద్దు. నిన్ను పెళ్లి చేసుకోలేను’ అని చెప్పాడు. ఇది విని దిగ్భ్రాంతి చెందిన హర్షిద తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ విషయంపై తన తల్లిదండ్రులకు చెప్పిన హర్షిద, తాను దర్శన్‌తోనే కలిసి జీవించాలనుకుంటున్నట్లు తెలిపింది. ఈ విషయమై శనివారం రాత్రి 9 గంటలకు వేప్పేరిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో 7వ అంతస్తులో ఉన్న దర్శన్ ఇంట్లో ఇరు కుటుంబాలు చర్చలు జరిపాయి. దర్శన్, హర్షిద ఇద్దరూ విడిగా ఒక గదిలోకి వెళ్లి మాట్లాడుకున్నారు.
ఆ సమయంలో హర్షిత, దర్శన్‌తో నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నన్ను వద్దు అనకు అని బ్రతిమిలాడింది. కాని దర్శన్ మనసు మార్చుకోకుండా కలిసి జీవించాలని నేను కోరుకోవడం లేదు. మనం ఇద్దరం విడిపోదామని చెప్పి, పెళ్లి చేసుకోనని కచ్చితంగా చెప్పినట్టు తెలిసింది. దీంతో తీవ్ర వేదనకు గురైన హర్షిద ఇక బ్రతికి ఉండటంలో అర్థం లేదనే నిర్ణయానికి వచ్చింది. దీంతో హర్షిత మిద్దె పైకి వేగంగా పరిగెత్తి కిందకు దూకింది. రేకుల షెడ్డుపై పడింది. 7వ అంతస్తు బాల్కనీలో ఎండ పడకుండా వేసిన రేకుల షెడ్డుపై హర్షిత పడింది. దానిపై కూర్చున్నట్లే ఇప్పుడైనా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. దీనికి దర్శన్ సమాధానమిస్తూ ఇందులో తన తప్పు ఏమీ లేదని చెప్పి, మళ్లీ పెళ్లికి నిరాకరించినట్లు మాట్లాడాడు. దీంతో మరింత మనస్తాపం చెందిన హర్షిత, రేకుల షెడ్డు నుండి మళ్లీ కిందకు దూకింది. ఈ ఘటనలో ఆమె శరీరం ఛిద్రమై అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనపై వేప్పేరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.