శ్రీచైతన్యలో మరో విద్యార్థిని బలవన్మరణం

Sri Chaitanya College Student Committed Suicide - Sakshi

హైదరాబాద్‌: సరూర్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కొత్తపేట శ్రీ చైతన్య మహిళా జూనియర్‌ కాలేజీలో మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న అర్చన అనే విద్యార్థిని  కాలేజీ హాస్టల్లోనే  ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  ఆమె ఆత్మహత్యకు యత్నించిన విషయాన్ని గమనించిన సిబ్బంది హుటాహుటీనా దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చూడగా అప్పటికే చనిపోయింది.

అర్చన స్వస్థలం నల్గొండ జిల్లా సంస్థాన్‌ నారాయణపురం. కాలేజీ డీన్‌ మమతా తిట్టడంతోనే ఆత్మహత్య చేసుకుందని సమాచారం. విద్యార్థి కుటుంబసభ్యులకు న్యాయం చేసి, బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌వీ సంఘం నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top