అన్నను హత్య చేసిన చెల్లి?

Sister Murder To Brother With Boy Friend In Prakasam - Sakshi

లక్కవరం గ్రామంలో ఘటన

వివాహేతర సంబంధం వద్దన్నందుకు ప్రియునితో కలిసి హతమార్చినట్లుగా అనుమానం

హత్య కేసు నమోదు చేసిన పోలీసులు

ప్రకాశం, తాళ్లూరు: అక్రమ సంబంధం కొనసాగిస్తున్న చెల్లిని వారించిన అన్నను ప్రియునితో కలిసి చెల్లెలు హత్య చేసిన సంఘటన తాళ్లూరు మండలం లక్కవరంలో గురువారం రాత్రి  వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు కథనం. తల్లి ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. లక్కవరం గ్రామానికి చెందిన నన్నం కోటయ్య, మహాలక్ష్మమ్మకు నన్నం వెంకటేశ్వర్లు (32), తిరుపతమ్మ సంతానం కలిగారు. ఇరువురికి తల్లిదండ్రులు వివాహం చేశారు. నన్నం వెంకటేశ్వర్లు ఆరోగ్య సమస్యతో ఉండగా భార్య అతనిని విడచి వెళ్లిపోయింది. తిరుపతమ్మ కూడా భర్తతో విడిపోయి ఇంటివద్దనే ఉంటోంది. ఈ నేపథ్యంలో తిరుపతమ్మ అదే గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డితో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.

ఆటోల్లో ఇతర ప్రాంతానికి కూలీకి వెళుతూ ఉండేవారు. తిరుపతమ్మ తల్లి కూడా వేరే గ్రామానికి వెళ్లటంతో ఇద్దరి మధ్య ఏకాంతం ఎక్కువైంది. వారి వ్యవహారం గమనించిన అన్న వెంకటేశ్వర్లు ఇది మంచి పద్ధతి కాదని వారించాడు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు తన పొలం వద్దె ఉన్న నీటి కుంటలో శవమై తేలాడు. విషయం తెలిసిన బంధువులు శవాన్ని గురువారం రాత్రి నివాసానికి తీసుకువచ్చారు. అయితే పొరపాటున పడి మరణించి ఉంటారని తిరుపతమ్మ గ్రామస్తులతో నమ్మబలికింది. కానీ పొలంలో ప్రియునితో కలిసి అన్నను హత్యచేసి నీటి కుంటలో వేసి ఉంటారని గ్రామస్తులు అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్‌ఐ రంగనాథ్‌ శుక్రవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దర్శి ఇన్‌చార్జి సీఐ హైమారావు వివరాలు సేకరించారు. మృతదేహాన్ని దర్శి వైద్యశాలకు తరలించారు.  హత్య, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఎస్‌ఐ రంగనా«థ్‌ కేసు నమోదు చేశారు.

నిందితులను శిక్షించాలి..
దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు నీలం నాగేంద్రం, జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు దారా అంజయ్య, దళిత హక్కుల నేత డానీ మృత దేహాన్ని సందర్శించారు. మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top