పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో భారీ చోరీ

Robbery At Trichy Punjab National Bank - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడు తిరుచ్చి జిల్లాలోని సమయపురం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. బ్యాంకులోని 10 కోట్ల రూపాయల నగదు, 5 కేజీల బంగారాన్ని దుండగులు అపహరించారు. జాతీయ రహదారి పక్కనే ఉండే సమయపురంలో ఇంతటి భారీ దోపిడీ జరగడం జిల్లాలో కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళ్తే.. 26, 27 తేదీలు బ్యాంకుకు సెలవు దినాలు కావడంతో సోమవారం ఉదయం సిబ్బంది బ్యాంకు తెరిచారు. అనంతరం బ్యాంకు లోపలికి వెళ్లి చూడగా చోరీ విషయం బయటపడింది. గోడకు కన్నం పెట్టిన దుండగులు బ్యాంకు స్ట్రాంగ్‌ రూమ్‌లోని ప్రవేశించినట్టుగా తెలుస్తోంది

బ్యాంకు సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్యాంకు వెనక భాగంలో వెల్డింగ్‌ మిషన్‌తోపాటు పలు పరికరాలను పోలీసులు గుర్తించారు. అక్కడ లభ్యమైన ఆధారాలను బట్టి ముగ్గురు వ్యక్తులు ఈ దోపిడీలో పాల్గొన్నట్టు వారు అనుమానిస్తున్నారు. బ్యాంకు సీసీటీవీల్లో రికార్డైన దృశ్యాలను సేకరిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top