జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పొచన్నపేట గ్రామంలో దొంగలు హల్‌చల్ చేశారు.
సాక్షి, బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పొచన్నపేట గ్రామంలో దొంగలు హల్‌చల్ చేశారు. గ్రామంలోని దుర్గామాత, పెద్దమ్మ తల్లి ఆలయాల్లో శుక్రవారం రాత్రి దొంగలు పడి అమ్మవారి బంగారు ఆభరణాలు, హుండీలు ఎత్తుకెళ్లారు.
ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. అమ్మవారి బంగారు ముక్కు పుడకలు, వడ్డానాలు, హుండీలోని నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు.