
అరవింద్(ఫైల్)
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్‌అర్బన్) : అక్కపెళ్లికి అవసరమైన డబ్బుల కోసం నిజామాబాద్‌కు వచ్చిన త మ్ముడు పెళ్లి చూడకుండానే అనంతలోకానికి వెళ్లాడు. వివరాలు.. జక్రాన్‌పల్లి మండలం పడకల్ తండాకు చెందిన బానోత్ జీవన్ సుజాతకు ఇద్దరు కుమారులు. జీవన్ తన అన్న కూతురి పెళ్లి ఈనెల 9న జరుగవలసి ఉంది. పెళ్లికి డబ్బులు అవసరం ఉండటంతో జీవన్ తన కొడుకు అరవింద్(18)ను నిజామాబాద్‌కు వెళ్లి డబ్బు లు తీసుకురావాలని చెప్పాడు.
అరవింద్ ఆర్మూర్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తనకు తోడుగా అరవింద్ దగ్గరి బంధువైన బాదవత్ వినోద్‌ను బైక్‌పై ఎక్కించుకుని నిజామాబాద్‌కు బయలుదేరారు. అనంతరం బ్యాంక్‌లో డబ్బులు డ్రా చేసుకుని తిరిగి పడకల్ తండాకు బయలుదేరారు. వీరి బైక్ నగరంలోని వినాయక్‌నగర్‌కు రాగానే కామారెడ్డి నుంచి నిజామాబాద్‌కు వస్తున్న కామారెడ్డి డిపోకు చెందిన టీఎస్ 17 టీ 2727 నంబరు గల ఆర్‌టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అరవింద్ అక్కడికక్కడే మృతిచెందగా వినోద్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. మృతుడి తండ్రి జీవన్ ఫిర్యాదు మేరకు ఆర్‌టీసీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శంకర్ తెలిపారు.