దూసుకొచ్చిన మృత్యుశకటం

Road Accident - Sakshi

భూత్పూర్‌ (దేవరకద్ర) : అత్యంత వేగంగా దూసుకొచ్చిన ఓల్వో బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళ చికిత్స పొందుతూ మృతిచెందగా.. 13 మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన గురువారం మండలంలోని అన్నాసాగర్‌ సమీపంలో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జానంపేటకు చెందిన ఆటో ప్రతిని త్యం భూత్పూర్‌ నుంచి జానంపేటకు ప్రయాణికులను తరలిస్తుంటారు.

గురువారం సాయంత్రం భూత్పూర్‌ నుంచి జానంపేట వైపు వెళ్తున్న ఆటోలో డ్రైవర్‌తోపాటు 13 మంది భూత్పూర్‌ నుంచి జాంపేటకు వెళ్తుండగా అన్నాసాగర్‌ సమీపంలో హైదరాబాద్‌ నుంచి కొచ్చిన్‌ వెళ్తున్న ఓల్వో బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న జహంగీరమ్మ(48) (జానంపేట), చంద్రమ్మ (అన్నాసాగర్‌), బాలరాజు (ఆటో డ్రైవర్‌), రాకేశ్‌ (జానంపేట), శ్రీనివాసులు (పోల్కంపల్లి), సత్తమ్మ (అన్నాసాగర్‌), దేవమ్మ (కనకాపూర్‌ తండా), సుంకరి జయమ్మ (రావులపల్లి), కావలి హన్మంతు (రావులపల్లి), తుప్పలన్న (రావులపల్లి), కావలి వెంకటమ్మ (రావులపల్లి), శంకర్‌నాయక్‌ (కనకాపూర్‌ తండా), నాగమ్మ (అన్నాసాగర్‌), నాగమ్మ (అన్నాసాగర్‌)లకు తీవ్ర గాయాలు కాగా ఎల్‌అండ్‌ టీ అంబులెన్స్, 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించారు.

జానంపేటకు చెందిన జహంగీరమ్మ చేయి విరిగి 5 మీ టర్ల దూరంలో పడిపోయింది. జహంగీరమ్మ జి ల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా, చంద్రమ్మ, ఆటోడ్రైవర్‌ బాలరాజుల పరిస్థితి విషమంగా మారిందని ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఓల్వో బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. ఇందులో ఆటోడ్రైవర్‌ బాలరాజు, శ్రీనివాసులు, చంద్రమ్మల పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. 

రెండు గ్రామాల్లో విషాదం.. 

మూసాపేట (దేవరకద్ర) : భూత్పూరు మండలం అన్నాసాగర్‌ వద్ద గురువారం సాయంత్రం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మూసాపేట మండలంలోని జానంపేట, కనకాపూర్‌తండాకు చెందిన పలువురు గాయపడటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. జానంపేటకు చెందిన బాలరాజు(30), జహంగీరమ్మ (48), కనకాపూర్‌తండాకు చెందిన శంకర్‌నాయక్‌(45), దేవమ్మ(45) అందరూ కూలీపని చేసు కుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.

శంకర్‌నాయ క్, దేవమ్మలకు స్వల్ప గాయాలు కాగా, జహంగీరమ్మ మృతిచెందింది. బాలరాజు తలకు తీవ్రగాయాలు కావడంతో హైదరాబాద్‌లోని సాయికృష్ణ ఆస్పత్రికి తరలించారు. నలుగురు కూడా పొట్టకూ టి కోసం వివిధ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. శంకర్‌నాయక్, దేవమ్మలు వ్యవసాయానికి అవసరమైన తాళ్లు అల్లుకుని వాటిని అమ్మి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. జానంపేట గ్రామానికి చెందిన బాలరాజు ఆటోతో జీవనం కొనసాగిస్తుండగా, జాహంగీరమ్మ భూత్పూరులో పల్లీలు అమ్ముకుని జీవనం కొనసాగిస్తుంది.

బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

భూత్పూర్‌: మండలంలోని అన్నాసాగర్‌ సమీపంలో గురువారం సాయంత్రం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి రాత్రి పరామర్శించారు. అన్నాసాగర్‌కు చెందిన చంద్రమ్మకు రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ప్రమాద సంఘటనలో అన్నాసాగర్, రావుపల్లి, పోల్కంపల్లి, జానంపేట, కనకాపూర్‌తండా వాసులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల కు చికిత్స అందించాలని ఎమ్మెల్యే ఆల వైద్యులకు సూచించారు

. బీసీ రాష్ట్ర నాయకులు, అన్నాసాగర్‌ సర్పంచ్‌ మంజుల పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్‌ల సం ఘం మండలాధ్యక్షుడు ఆంజనేయులు, శశివర్ధన్‌రెడ్డి, రాజారెడ్డి, శ్రీనివాసులు తదితరులున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top