హిట్‌ అండ్‌ రన్‌ : రేడియో జాకీ అరెస్ట్‌

RJ arrested for LJP worker  death in hit and run case in Delhi  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌జనశక్తి పార్టీ కార్యకర్త మృతికి కారణమైన కేసులో రేడియో జాకీ (ఆర్‌జే) అంకిత్‌ గులాటిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హిట్ అండ్ రన్ కేసులో ఆర్‌జేని అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రేడియో సిటీ ఆర్‌జే అంకిత్ గులాటి తన కారును వేగంగా నడుపుతూ ఎల్‌జేపీ కార్యకర్త ధీరజ్‌ కుమార్‌ బైక్‌ను ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో ధీరజ్‌ కుమార్‌ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గత ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాద స్థలంనుంచి పారిపోయిన గులాటిని శుక్రవారం రాత్రి  అరెస్ట్‌ చేశామని  పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ మృతుడి కుటుంబ సభ్యులను శుక్రవారంపరామర్శించారు. ఈ ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే  పోలీసులు గులాటిని  అరెస్ట్‌ చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top