గుంటూరులో కాల్పుల కలకలం | Retired Army Man Open Firing In Guntur District | Sakshi
Sakshi News home page

గుంటూరులో కాల్పుల కలకలం

Feb 22 2020 12:42 PM | Updated on Feb 22 2020 1:05 PM

Retired Army Man Open Firing In Guntur District - Sakshi

సాక్షి, గుంటూరు: జిల్లాలోని చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామంలో కాల్పులు కలకలం రేపాయి. ఓ రిటైర్డ్‌ ఆర్మీ జవాన్‌ నాటు తుపాకీతో కాల్పులకు తెగపడ్డాడు. ఈ కాల్పుల్లో రమాదేవి అనే మహిళ గాయపడ్డారు. దీంతో స్థానికులు గాయపడ్డ మహిళను తెనాలి ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన రిటైర్డ్‌ జవాన్‌ అక్కడ నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకున్నారు.  కుటంబ కలహాల కారణంగానే ఆర్మీ జవాన్ కాల్పులకు పాల్పడినట్టు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. పరారైన రిటైర్డ్‌ ఆర్మీ జవాన్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement