నటి విజయలక్ష్మిపై రవిప్రకాశ్‌ ఫిర్యాదు | Ravi Prakash Complaint Against Vijaya Laxmi in Karnataka | Sakshi
Sakshi News home page

నటి విజయలక్ష్మిపై రవిప్రకాశ్‌ ఫిర్యాదు

Mar 12 2019 8:30 AM | Updated on Mar 12 2019 8:30 AM

Ravi Prakash Complaint Against Vijaya Laxmi in Karnataka - Sakshi

సాక్షి బెంగళూరు: తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ నటుడు రవి ప్రకాశ్‌పై నటి విజయలక్ష్మి చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఆమెపై కర్ణాటక వాణిజ్య మండలిలో రవి ప్రకాశ్‌ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కష్టాల్లో ఉన్న ఆమెకు తాను నగదు సాయం చేశారని తెలిపారు. అంతేకానీ ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని అన్నారు. ఆస్పత్రిలో చికిత్స కోసం కష్ట సమయంలో సహాయం చేయాలని కోరితే డబ్బులను ఇచ్చినట్లు తెలిపారు. కానీ విజయలక్ష్మి మాత్రం తనను అవమానం చేస్తూ అసభ్యకర పదజాలంతో దూషిస్తోందని చెప్పారు. తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో తన డబ్బులు తనకు ఇచ్చేయాలని, అలాగే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement