సీఎంపై వివాదాస్పద వ్యాఖ్యలు : గాయని బుక్‌ | Rapper Hard Kaur Charged With Sedition for Posts Against Adityanath Bhagwat | Sakshi
Sakshi News home page

సీఎంపై వివాదాస్పద వ్యాఖ్యలు : గాయని బుక్‌

Jun 20 2019 2:07 PM | Updated on Jun 20 2019 2:23 PM

Rapper Hard Kaur Charged With Sedition for Posts Against Adityanath Bhagwat - Sakshi

యూకేకు చెందిన గాయని తరన్‌  కౌర్‌ ధిల్లాన్‌ (హర్ద్ కౌర్) వ్యాఖ్యలు  దుమారాన్నే రాజేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై  సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై వారణాసిలో పోలీసులు  కేసు  నమోదు చేశారు. బాలీవుడ్‌ గాయని హర్ద్‌ కౌర్‌పై సెక్షన్ 124 ఏ, 153 ఏ, 500 కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది.  సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ఏకంగా రేప్‌మేన్‌ అని పిలవాలంటూ సోషల్‌ మీడియాలో  కమెంట్‌ చేశారు. అంతేకాదు   మోహన్ భగవత్‌  ఉగ్రవాదిగా పేర్కొన్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో తన అభిప్రాయాలను  పోస్ట్‌ చేశారు.  దీంతో  వివాదం  రాజుకుంది. పలువురు నెటిజర్లు ఆమెకు మద్దతిస్తుండగా,  మరికొందరు ఆమె వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.  ప్రధానంగా వారణాసికి చెందిన ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త, న్యాయవాది శశాంక్‌ శేఖర్‌ ఫిర్యాదు చేయడంతో  ఈ పరిణామం చోటు చేసుకుంది. దీనిపై దర్యాప్తు చేపట్టామని  పోలీసు అధికారి అమర్‌ ఉజాలా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement