అగస్టా కేసులో సక్సేనా అరెస్ట్‌ | Rajiv Saxena, lobbyist Deepak Talwar extradited to India | Sakshi
Sakshi News home page

అగస్టా కేసులో సక్సేనా అరెస్ట్‌

Feb 1 2019 5:31 AM | Updated on Feb 1 2019 8:35 AM

Rajiv Saxena, lobbyist Deepak Talwar extradited to India - Sakshi

సక్సేనా, తల్వార్‌

న్యూఢిల్లీ: అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఈ వ్యవహారంలో నిందితుడిగా ఉన్న వ్యాపారవేత్త రాజీవ్‌ సక్సేనాతో పాటు రూ.90 కోట్ల నిధులను మళ్లించిన కేసులో నిందితుడు, లాబీయిస్టు దీపక్‌ తల్వార్‌ను దుబాయ్‌ అధికారులు భారత్‌కు అప్పగించారు. ఢిల్లీ విమానాశ్రయానికి గురువారం తెల్లవారుజామున 1.30 గంటలకు చేరుకున్న వీరిని ఈడీ అధికారులు వెంటనే అరెస్ట్‌ చేశారు. అనంతరం సక్సేనాను అధికారులు ఢిల్లీలోని ఓ కోర్టు ముందు ప్రవేశపెట్టగా నాలుగు రోజుల కస్టడీకి అప్పగిస్తూ జడ్జి ఉత్తర్వులు జారీచేశారు. అదేవిధంగా, ఓ విదేశీ క్షిపణి తయారీ కంపెనీ నుంచి తన ఎన్జీవోకు వచ్చిన రూ.90.72 కోట్ల ను దారి మళ్లించిన కేసులో దీపక్‌ తల్వార్‌ను పటియాలా కోర్టు ఏడురోజుల కస్టడీకీ అనుమతించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement