మృతదేహాన్ని వెలికితీసి అక్కడే పోస్టుమార్టం

Postmortem Examination Done To Sravan Kumar Reddy At Chegunta - Sakshi

ఇబ్రహీంపూర్‌లో కొడుకును చంపిన ఉదంతం 

సంఘటనా స్థలానికి భారీగా చేరిన జనాలు

సాక్షి, తూప్రాన్‌: కన్నకొడుకును హత్యచేసి పూడ్చిపెట్టిన కుమారుడి మృతదేహాన్ని వెలికితీసి ఇబ్రహీంపూర్‌ గ్రామంలోనే తహసీల్దార్‌ గోవర్ధన్‌ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. గ్రామానికి చెందిన పీఎసీఎస్‌ చైర్మన్‌ నారాయణరెడ్డి తన కొడుకును ఈనెల 7వ తేదీ సోమవారం రాత్రి చంపేసి పౌల్ట్రీఫాం సమీపంలో పూడ్చివేసి గురువారం పోలీసులకు లొంగిపోయాడు. శుక్రవారం తహసీల్దార్‌ గోవర్ధన్‌  తూప్రాన్‌  డీఎస్పీ కిరణ్‌కుమార్‌ పోలీస్‌ సిబ్బంది మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతదేహం ముఖం భాగం కుళ్లిపోయి ఉండగా సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేశాన్ని బంధువులకు అప్పగించారు.  అనంతరం అక్కడే శవాన్ని పాతిపెట్టారు. మధ్యాహ్నం వరకు పోస్టుమార్టం నిర్వహించే సిబ్బంది రాకపోవడంతో గ్రామస్తులు భారీ సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. పౌల్ట్రీఫాం ఆవరణలో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని తూప్రాన్‌  డీఎస్పీ కిరణ్‌కుమార్‌ ప్రజలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మృతుడు శ్రావణ్‌కుమార్‌రెడ్డికి సంబంధించిన బంధువులతో మాట్లాడి తండ్రీకొడుకులకు మధ్య గొడవలకు గల కారణాలపై ఆరా తీశారు. నారాయణరెడ్డి అంటే భయంగా ఉందని, ఆయనను గ్రామంలోకి రానీయకుండా చర్యలు తీసుకోవాలని మహిళలు డీఎప్పీని కోరారు. ఇబ్రహింపూర్‌ గ్రామాన్ని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌ రావ్‌ సందర్శించి చట్టప్రకారం నిందితులకి శిక్షపడేలా పోలీసులు చూడాలని కోరారు. శ్రావణ్‌కుమార్‌రెడ్డి మృతితో బంధువులు ఇబ్రహీంపూర్‌లోని పౌల్ట్రీఫాంకు చేరుకున్నారు.  

నిందితులందరినీ అరెస్టు చేస్తాం: డీఎస్పీ 
శ్రావణ్‌కుమార్‌రెడ్డి హత్య విషయంలో నారాయణరెడ్డితో పాటు అతని సోదరుల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. గ్రామంలోనే పోస్టుమార్టం పూర్తి చేయించామని పోస్టుమార్టం నివేదిక రాగానే అన్ని కోణాల్లో కేసును విచారించి శ్రావణ్‌కుమార్‌రెడ్డి హత్యలో సంబంధం ఉన్న వారందరినీ అరెస్టు చేస్తామని డీఎస్పీ కిరణ్‌కుమార్‌ పేర్కొన్నారు. గ్రామంలో ఎలాంటి గొడవలకు తావులేకుండా మూడు రోజల వరకు గ్రామంలో పోలీస్‌ల పర్యవేక్షణ ఉంటుందని డీఎస్పీ తెలిపారు. చేగుంట ఎస్‌ఐ సత్యనారాయణ, చిన్నశంకరంపేట ఎస్‌ఐ ప్రకాశ్‌గౌడ్‌తో పాటు ఆయా పోలీస్‌స్టేషన్ సిబ్బంది ఉన్నారు.  

చదవండి: కొడుకును చంపి పూడ్చిపెట్టిన తండ్రి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top