కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నాం :డీసీపీ

Police Search Is Going On For Kinappers Who Attempted To Kidnap Domalguda Based Businessman Says DCP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దోమలగూడకు చెందిన వ్యాపారి గజేంద్ర ప్రసాద్‌ను ఏవీ కాలేజ్ దగ్గర  ఆదివారం రాత్రి 11 గంటలు సమయంలో కిడ్నాప్ కు గురైన సంగతి తెలిసిందే. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తనను కిడ్నాప్‌ చేసి రూ. కోటి వసూలు చేసి విడిచిపెట్టారంటూ గజేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ముంబై కి చెందిన ఓ ఫైనాన్స్ ఆటో మొబైల్ ను గజేంద్రతో పాటు అతని సోదరుడు నడుపుతున్నారు. కాగా చిక్కడపల్లిలో నిన్న రాత్రి గజేందర్‌ ప్రసాద్‌ను కిడ్నాప్‌ చేసి అనంతరం డబ్బులు డిమాండ్ చేశారు. భాదితుడు యాబై లక్షలు ఇస్తాను వదిలేయండి అని వేడుకున్నా కానీ.. కిడ్నాపర్లు ఒప్పుకోలేదు. దీంతో వ్యాపారవేత్త గజేంద్ర, స్నేహితుడు రాహుల్కి కాల్ చేశాడు. రాహుల్ కోటి రూపాయలు కిడ్నాపర్లకు చేరవేయడంతొ, కోఠి సమీపంలోని జ్యూస్ షాప్ వద్ద గజేంద్రను వదిలి వెళ్లారు. 

ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన  పోలీసులకు గతంలో గజేంద్ర సోదరుడు కమిలేశ్ పై చీటింగ్ కేసులు ఉన్నాయనే విషయం వెలుగులోకి వచ్చింది. సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.  కిడ్నాపర్ల కోసం టాస్క్ ఫోర్స్తో పాటు మరో రెండు టీమ్స్ గాలిస్తున్నామని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top