పీవీపీని బెదిరించిన బండ్ల గణేష్‌ | Police Complaint Against Bandla Ganesh | Sakshi
Sakshi News home page

సినీ నిర్మాత బండ్ల గణేష్‌పై కేసు

Oct 5 2019 8:29 AM | Updated on Oct 5 2019 11:08 AM

Police Complaint Against Bandla Ganesh - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్‌పై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. వైఎస్సార్‌ సీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ)ను బండ్ల గణేష్‌ తన అనుచరులతో కలిసి గతరాత్రి బెదిరింపులకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘టెంపర్‌’  చిత్రానికి బండ్ల గణేష్‌ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఆ చిత్రానికి పీవీపీ రూ.7 కోట్లు ఫైనాన్స్‌ చేశారు. గత కొంతకాలంగా తనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని పీవీపీ అడుగుతున్నారు.

ఈ నేపథ్యంలో నిన్న అర్థరాత్రి దాటాక కొంతమంది వ్యక్తులతో కలిసి పీవీపీ నివాసంపై బండ్ల గణేష్‌ మనుషులు బెదిరింపులకు పాల్పడటమే కాకుండా, దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీనిపై పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 448, 506, రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద బండ్ల గణేష్‌తో పాటు నలుగురిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బండ్ల గణేష్‌ పరారీలో ఉన్నాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గతంలోనూ బండ్ల గణేష్‌పై చీటింగ్‌ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement