ప్రాణం తీసిన ఇడ్లీ!

సాక్షి, చెన్నై: ఇడ్లీలు తినే పోటీలో విషాదం చోటుచేసుకుంది. ఇడ్లీ గొంతులో ఇరుక్కుపోవడంతో శ్వాస ఆడకడో వ్యక్తి మృతిచెందాడు. సం​‍క్రాంతి వేడుకల్లో భాగంగా తమిళనాడులోని పుదుకోట్టై కీరమంగళంలోని కళ్లిచ్చియమ్మన్‌ ఆలయంలో మంగళవారం సాయంత్రం నుంచి ప్రత్యేక పోటీలు జరిగాయి. ఇందులో భాగంగా రాత్రి ఇడ్లీలు తినే పోటీలు సాగాయి. ఇందులో పెద్ద సంఖ్యలో యువకులు తమ సత్తాను చాటుకునే ప్రయత్నం చేశారు. ఇందులో గ్రామానికి చెందిన చిన్న తంబి(45) అనే వ్యక్తి అతివేగంగా ఇడ్లీలు తింటుండగా గొంతులో ఇరుక్కుపోయింది. శ్వాస ఆడక అవస్థ పడుతున్న అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతిచెందాడు. ఈ పోటీ మూలంగా ఇంటి పెద్ద దిక్కును కోల్పోయామని చిన్నతంబి భార్య చిత్ర, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు విలపిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top