స్నేహితురాలి టిక్‌టాక్‌: బుక్కైన పోలీస్‌

Officials Serious On Police Constable After His Female Friend Did Tiktok With Dress - Sakshi

ముంబై : స్నేహితురాలి టిక్‌టాక్‌ పిచ్చి కారణంగా ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ బుక్కయ్యాడు. ఆమె అతడి పోలీస్‌ డ్రెస్‌ వేసుకుని వీడియోలు చేయడంతో అధికారులు కానిస్టేబుల్‌పై దర్యాప్తుకు ఆదేశించారు. ఈ సంఘటన ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన విజయ్‌ బ్రాహ్మణి అక్కడి ఓ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం విజయ్‌ స్నేహితురాలు ఒకామె అతడి పోలీస్‌ డ్రెస్‌ను ధరించి టిక్‌టాక్‌లో కొన్ని వీడియోలు చేసింది. అవి కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలు అధికారుల దృష్టిలో సైతం పడ్డాయి. వాటిలో అభ్యంతరకర దృశ్యాలు లేకపోయినా ఆ యువతి పోలీస్‌ డ్రెస్‌ వేసుకున్నందుకు గానూ ఎస్పీ శివాజీ రాథోడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ( పావని అనే యువతిని పావుగా వాడి..)

విజయ్‌పై విచారణకు ఆదేశించారు. విచారణ పూర్తయిన అనంతరం అతడిపై చర్యలు తీసుకుంటామని డీవైఎస్పీ సంజయ్‌ కుమార్‌ తెలిపారు. కాగా, టిక్‌టాక్‌, వాట్సాప్‌, ట్విటర్‌లలో అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన నాలుగురోజులకే అజయ్‌ పోలీస్‌ డ్రెస్‌ ఘటన జరగటం గమనార్హం.
(బంగారు శ్రుతి కేసు!.. ఇలా ‘తెగించేశారు’.!)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top