నిర్భయ కేసు : మరో కీలక పరిణామం

Nirbhaya case  SC dismisses curative plea of convict Pawan Gupta   - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నిర్భయ హత్యాచార కేసులో మరో కీలకపరిణామం చోటు చేసుకుంది.  2012 సామూహిక హత్యాచార కేసులో దోషి పెట్టుకున్న క్యూరేటివ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు  సోమవారం తిరస్కరించింది. తనకు విధించిన మరణ శిక్షను యావజ్జీవ  ఖైదు శిక్షగా మార్చాలంటూ  నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్‌ కుమార్‌ గుప్త పెట్టుకున్న పిటిషన్‌ను  సుప్రీం ధర్మాసనం కొట్టి వేసింది. ఈ పిటిషన్‌ విచారణకు ఎలాంటి కొత్త అంశాలు లేవని స్పష్టం చేసింది.  జస్టిస్ ఎన్ వి రమణ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల (అరుణ్ మిశ్రా, ఆర్ఎఫ్ నారిమాన్, భానుమతి, అశోక్ భూషణ్) ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. అయితే రాష్ట్రపతి​కి మెర్సీ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం పవన్‌ గుప్తాకు ఇంకా మిగిలే  ఉంది.

చదవండి : నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు వాయిదా?

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top