
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలోని ఎస్. రాయవరం మండలం గోకులపాడు సమీపంలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నవ వరుడు మృత్యువాత పడ్డాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. వివరాలివి.. అనకాపల్లి శారదానగర్‌కు చెందిన శంకర్ అనే వ్యక్తికి మూడు రోజుల క్రితం వివాహం అయినట్లు తెలుస్తోంది. దంపతులు ఇద్దరు సియాజ్ కారులో అనకాపల్లి నుంచి పాసర్ల వైపు బయలుదేరారు. వేగంగా ప్రయాణిస్తున్న దంపతుల కారు గోకులపాడు సమీపంలో లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో నవ వరుడు తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతి చెందాడు. అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.