పెళ్లైన ఆరు రోజులకే.. | New Couples Died In Car Accidents | Sakshi
Sakshi News home page

పెళ్లైన ఆరు రోజులకే..

Feb 17 2019 8:06 AM | Updated on Jul 10 2019 7:55 PM

New Couples Died In Car Accidents - Sakshi

అన్నానగర్‌: కారు అదుపుతప్పి కంటైనర్‌ లారీని ఢీకొన్న ప్రమాదంలో నవదంపతులు మృతి చెందారు. ఈ సంఘటన పర్కూర్‌ సమీపంలో శుక్రవారం జరిగింది. వివరాలు.. వేలూర్‌ జిల్లా వానియంబాడి అబ్దుల్‌ రహ్మాన్‌ వీధికి చెందిన మునీర్‌ అహ్మద్‌. ఇతను ఆ ప్రాంతంలో తోలు పరిశ్రమ నడుపుతున్నాడు. ఇతని కుమారుడు అబ్దుల్‌ రహ్మాన్‌ అహ్మద్‌ (23)కి వానియంబాడికి చెందిన జికానామాగిన్‌ (21)కి ఆరు రోజుల కిందట వివాహం జరిగింది. ఈక్రమంలో నవదంపతులు ఇద్దరూ బెంగళూర్‌లోని బంధువుల ఇంటికి గురువారం కారులో వెళ్లారు. తరువాత అక్కడి నుంచి శుక్రవారం కారులో వానియంబాడికి తిరిగి వస్తున్నారు.

 కారు కృష్ణగిరిలోని పర్కూర్‌ సమీపం చిన్న పర్కూర్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద వస్తోంది. అప్పుడు హఠాత్తుగా అదుపుతప్పిన కారు డివైడర్‌ని ఢీకొని ఎదురుగా వస్తున్న కంటైనర్‌ లా రీని ఢీకొంది. అబ్దుల్‌ రహ్మాన్‌ అహ్మద్, జికానా మాగిన్‌ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు  సం ఘటన స్థలానికి చేరు కుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement