పర్మిట్‌ రూంలో క్లీనర్‌ హత్య | Mother Killed By In Nizamabad | Sakshi
Sakshi News home page

పర్మిట్‌ రూంలో క్లీనర్‌ హత్య

Jun 25 2018 7:12 PM | Updated on Oct 17 2018 6:10 PM

Mother Killed By In Nizamabad - Sakshi

 మృతదేహన్ని పరిశీలిస్తున్న పోలీసులు  

ఆర్మూర్‌టౌన్‌: పట్టణంలో షేక్‌ హైమద్‌(55) అనే వ్యక్తి హత్యకు గురైన సంఘటన ఆదివారం ఉదయం వెలుగు చూసింది. ఎస్‌హెచ్‌వో రాఘవేందర్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని రంగచారి నగర్‌కు చెందిన హైమద్‌ పాత ప్రాంతంలో గల కవిత వైన్స్‌కు సంబంధించిన పర్మిట్‌రూంలో క్లీనర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

కాగా షేక్‌ హైమద్‌ శనివారం çపర్మిట్‌రూంలో పని చేసేందుకు వెళ్లాడు. రాత్రి గడస్తున్నా పర్మిట్‌ రూం నుంచి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతడి ఆచూకీ కోసం వెతికారు. కాగా షేక్‌ హైమద్‌ ఆదివారం ఉదయం పర్మిట్‌ రూంలో శవమై కనిపించాడు.

సమాచారం అందుకున్న ఏసీపీ శివకుమార్, ఎస్‌హెచ్‌వో రాఘవేందర్, ఎస్‌ఐ గోపి సంఘటన స్థలానికి చేరుకొని హత్య వివరాలపై ఆరాతీశారు. గుర్తు తెలియని వ్యక్తులు షేక్‌ హైమద్‌ను చితకబాది హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు జిల్లా కేంద్రం నుంచి తీసుకువచ్చిన జాగిలాలతో ఆధారాలను సేకరించారు.

అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, 5 కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ఎజాజ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement