
అనిత (ఫైల్)
సాక్షి, సంగెం(పరకాల): కంప్యూటర్ కోర్సు నేర్చుకోవడానికి వెళ్లిన బాలిక అదృశ్యమైన సంఘటన సంగెం మండలం లో చోటుచేసుకుం ది. ఎస్సై ఎస్.దీపక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఎల్గూర్‌స్టేషన్ గ్రామపంచాయతీ శివారు రాజ్యానాయక్ తండాకు చెందిన మూడు అనిత(17) రెండు నెలలుగా వరంగల్ నగరంలోని ఓ ఇనిస్టిట్యూట్‌లో కంప్యూటర్ శిక్షణ పొందుతోంది. ఉదయం 9 గంటలకు ఆర్టీసీ బస్సులో వెళ్లి తిరిగి సాయంత్రం 3 గంటల వరకు ఇంటికి వస్తోంది.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఇంటి నుంచి శిక్షణకు వెళ్తున్నట్లు చెప్పి ఆర్టీసీ బస్సు ఎక్కి వెళ్లింది. తిరిగి సమయానికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఎంత వెదికినా ఆచూకీ లభించలేదు. దీంతో అనిత తండ్రి మూడు వీరన్న శనివారం సంగెం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే తన ఫిర్యాదులో నెక్కొండ మండలం చంద్రుగొండకు చెందిన పూర్ణచందర్, రాజ్యానాయక్ భుక్యా శివ, భుక్యా వెంకటేష్, మూడు బాలకృష్ణ, మూడు ప్రశాంత్, గుగులోత్ బాలులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని పేర్కొన్నారు.
కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అనిత ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు ఎరుపు రంగు పంజాబి డ్రస్సు, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉందన్నారు. ఆచూకీ లభిస్తే సంగెం పీఎస్ 9440700530, 9440904629 నంబర్లలకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.