విషం తాగి మహిళ ఆత్మహత్య | Married Women Commits Suicide in Hyderabad | Sakshi
Sakshi News home page

విషం తాగి మహిళ ఆత్మహత్య

Feb 8 2019 10:12 AM | Updated on Feb 8 2019 10:12 AM

Married Women Commits Suicide in Hyderabad - Sakshi

సరిత (ఫైల్‌)

పహాడీషరీఫ్‌: కుటుంబ కలహాల కారణంగా ఓ గృహిణి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది.ఈ సంఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ నాగేశ్వర్‌ రావు తెలిపిన మేరకు.. సిరిగిరిపురానికి చెందిన దాసరి రమేష్‌ కుమార్తె సరిత (30) వివాహం మంఖాల్‌కు చెందిన కావలి శ్రీనివాస్‌తో 2007లో జరిగింది. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. ఇటీవల శ్రీనివాస్‌ తల్లికి అనారోగ్యంగా ఉండడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి ఖర్చుల విషయంలో శ్రీనివాస్‌కు, అతని సోదరుడి నడుమ చిన్న పాటి గొడవ జరిగింది.

దీనికి పర్యావసనంగానే గ్రామ వీఆర్‌ఏ (కావలికారు) గా కొనసాగుతున్న శ్రీనివాస్‌ స్థానంలో తాను కూడా చేస్తానంటూ అతని సోదరుడు మొండికేయడంతో కుటుంబంలో గొడవలు కొనసాగుతున్నాయి. దీనిపై మనస్థాపానికి గురైన సరిత బుధవారం మధ్యాహ్నం గుర్తు తెలియని విషం తాగింది. అనంతరం భర్తకు ఫోన్‌ చేసి కిరోసిన్‌ తాగినట్లు వెల్లడించింది. వెంటనే భర్త కుటుంబ సభ్యులతో కలిసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందింది. కిరోసిన్‌ కాకుండా గుర్తు తెలియని విషం తాగి ఉంటుందని వైద్యులు తెలిపారని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement