9 నెలల చిన్నారిపై మేనమామ అఘాయిత్యం

Man Takes 9 Month Old Niece To Buy Toys Molested Her In West Bengal - Sakshi

కోల్‌కతా : చిన్నా, పెద్ద తేడా లేకుండా మహిళలపై రోజురోజుకి అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. తన మన తేడా లేకుండా మనుషులు మృగాళ్లుగా మారి అరాచాకాలకు తెగబడుతున్నారు. వీటిని అరికట్టడానికి ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు పోలీసులు కృషి చేస్తున్నా ఫలితం మాత్రం శూన్యం. దిశ కేసులోని నిందితులను శుక్రవారం పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసి మట్టుబెట్టిన విషయం తెలిసిందే. తాజగా నెలలు నిండని ఓ పసిపాపపై కామాంధుడైన మేనమామ అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో వెలుగు చూసింది. 

వివరాలు.. శ్యాంపూర్‌ పరిధిలోని బార్గావ్‌ ప్రాంతంలో తొమ్మిది నెలల చిన్నారితో కలిసి ఓ కుటుంబం జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటి పక్కనే ఉంటున్న మేనమామ బుధవారం పాపకు బొమ్మలు కొనిస్తానని మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లాడు. తిరిగి చిన్నారిని తల్లిదండ్రులకు అప్పజెప్పిన అనంతరం శిశువుకు రక్తస్రావం కావడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు అనుమానంతో శ్యాంపూర్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అనుప్‌ ప్రమానిక్‌గా గుర్తించారు.కాగా లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం( పోక్సో) యాక్ట్‌ కింద నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు  దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

చదవండి : దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌

 సోదరి వరస యువతిపై మృగాడి దాష్టీకం

స్నేహితుడితో కలిసి భార్యపై లైంగికదాడి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top