అత్యాచారం కేసు.. నిందితునికి జీవిత ఖైదు

Man Sentenced To Life For Raping 10 Year Old Girl In UP - Sakshi

ముజఫర్‌నగర్‌: పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఓ నిందితుడికి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ కోర్టు జీవిత ఖైదు విధించింది. అలాగే రూ.25 వేల జరిమానా కూడా విధించింది. 2014 సంవత్సరం జూలై 8న కిరణ్‌పాల్‌ అనే వ్యక్తి ముజఫర్‌నగర్‌ జిల్లా పంచెండకాలా గ్రామానికి చెందిన 10 ఏళ్ల బాలికను ఇంట్లో నుంచి ఎత్తుకు వచ్చాడు. అనంతరం స్కూల్‌ వద్ద అత్యాచారం చేసి పారిపోయాడు.

స్కూల్‌ వద్ద అపస్మారక స్థితిలో ఉన్న బాలికను స్థానికులు ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు తర్వాత నిందితుడు కిరణ్‌పాల్‌ను అరెస్ట్‌ చేశారు. నిందితునిపై భారత శిక్షా స్మృతిలోని వివిధ సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో శుక్రవారం తుదితీర్పు వెలువడింది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top