దాడి ఘటనలో వ్యక్తి మృతి | man killed in the incident | Sakshi
Sakshi News home page

దాడి ఘటనలో వ్యక్తి మృతి

Nov 19 2017 2:56 AM | Updated on Aug 29 2018 8:36 PM

man killed in the incident - Sakshi - Sakshi

కామారెడ్డి క్రైం: చర్చి ఫాదర్‌పై పెట్టిన లైంగిక వేధింపుల కేసును వెనక్కి తీసుకోవాలంటూ కొందరు చేసిన దాడిలో బాధితుడు గుండెపోటుకు గురై మరణించాడు. ఈ ఘటన కామారెడ్డిలో శనివారం జరిగింది. నిజామాబాద్‌కు చెందిన వమ్య దేవసహాయం (42) కామారెడ్డి జిల్లా భిక్కనూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్‌. ఆయన భార్య మమత రామారెడ్డి పీహెచ్‌సీలో స్టాఫ్‌ నర్సు. వారు కామారెడ్డిలోని సీఎస్‌ఐ చర్చి కాంపౌండ్‌ ప్రాంతంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వరుసకు బంధువైన సీఎస్‌ఐ చర్చి ఫాదర్‌ విల్సన్‌ తనను లైంగికంగా వేధిస్తున్నారని ఈనెల 4న మమత కామారెడ్డి డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఫాదర్‌ విల్సన్‌పై కేసు నమోదు చేశారు.

అయితే, కేసును వాపస్‌ తీసుకోవాలంటూ ఒత్తిళ్లు రావడంతో నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లి, శుక్రవారం సాయంత్రం తిరిగి వచ్చారు. విషయం తెలుసుకున్న దేవసహాయం సోదరులు సాల్మన్, శ్యాంసన్, ప్రసాద్, ప్రసాద్‌ భార్య కేజియా శనివారం వేకువజామున ఇంటికి వచ్చారు. కేసు వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చారు. దేవసహాయం నిరాకరించడంతో దాడి చేసి కొట్టి వెళ్లిపోయారు. ఈ క్రమంలో దేవసహాయం గుండెపోటుకు గురయ్యారు. ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ మరణించారు. దేవసహాయం మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మృతుడి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. కామారెడ్డి డీఎస్పీ ప్రసన్నరాణి, పట్టణ ఎస్‌హెచ్‌వో శ్రీధర్‌కుమార్, ఎస్‌ఐ రవికుమార్‌లు సంఘటనపై విచారణ జరిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement