సుల్తానాబాద్(కరీంనగర్ జిల్లా):
సుల్తానాబాద్ మండలకేంద్రంలోని స్వప్నా కాలనీలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ముత్తునూరి కొమరయ్య(45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడి స్వస్థలం పచ్చునూరు మండలం మానకొండూరు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లారీ, బైక్ ఢీ.. ఒకరు మృతి
Oct 11 2017 5:57 PM | Updated on Aug 30 2018 4:15 PM
Advertisement
Advertisement