వ్యాపారి ఆత్మహత్య.. సీఎం కేసీఆర్‌కు సందేశం | Man Commits Suicide After Sent Video To CM KCR | Sakshi
Sakshi News home page

వ్యాపారి ఆత్మహత్య.. సీఎం కేసీఆర్‌కు సందేశం

Dec 14 2019 9:07 AM | Updated on Dec 14 2019 9:07 AM

Man Commits Suicide After Sent Video To CM KCR - Sakshi

సోషల్‌ మీడియాలో ముక్తార్‌ పెట్టిన పోస్ట్‌

సాక్షి, కొత్తగూడెం : వ్యాపారంలో స్నేహితులు మోసం చేశారంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. చుంచుపల్లి మండలం ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కాలనీకి చెందిన ఎండీ ముక్తార్‌(33) కొత్తగూడెం పట్టణం చిన్నబజార్‌లో సనా డిజైనర్‌ వస్త్ర దుకాణం, జమా మసీద్‌ కాంప్లెక్స్‌లో లేడీస్‌ దుస్తుల షాపు నడిపించేవాడు. గత ఏడాది భద్రాచలంలో స్నేహితులతో కలిసి మరో వస్త్ర దుకాణం ప్రారంభించాడు. వ్యాపారంలో స్నేహితుడు రమేష్‌తో పాటు మరికొందరు మిత్రులు మోసం చేశారు. దీంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ముఖ్యమంత్రికి సందేశం..
ఆత్మహత్యకు ముందు సోషల్‌ మీడియాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వీడియో సందేశాన్ని రికార్డు చేసి పోస్టు చేశాడు. తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ వీడియో పోస్ట్‌ చేశాడు. వ్యాపారంలో నష్టపోయిన తీరును వీడియోలో వివరించాడు. తాను స్థానిక ఎమ్మెల్యే అభిమానినని వీడియోలో తెలిపాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement