పాఠశాలలో ‘లెస్బియన్‌’ కలకలం

Kolkata School Access Ten Students Of Being Lesbian - Sakshi

కోల్‌కతా: స్వలింగసంపర్కానికి పాల్పడినట్లు విద్యార్థినులతో ఓ పాఠశాల యాజమాన్యం లేఖలు రాయించుకున్న ఘటన పశ్చిమబెంగాల్‌లో కలకలం రేపింది. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కోల్‌కతాలోని కమల గర్ల్స్‌ హైస్కూల్‌కి చెందిన 10 మంది బాలికలు స్వలింగసంపర్కానికి పాల్పడినట్లు ఇతర విద్యార్థులు ప్రిన్సిపాల్‌కి ఫిర్యాదు చేశారు. పాఠశాల యాజమాన్యం బాలికలను పిలిచి విచారించింది.

తాము స్వలింగ సంపర్కానికి పాల్పడ్డామని వారు విచారణలో ఒప్పుకున్నట్టు పాఠశాల వర్గాలు పేర్కొన్నాయి. పాఠశాల యాజమాన్యం వారిచే లేఖలు రాయించుకుని విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. అయితే స్కూల్‌ యాజమాన్యం తీరుపై తల్లిదండ్రులు మండిపడ్డారు. తమ పిల్లలు స్వలింగ సంపర్కానికి పాల్పడలేదని, బలవంతంగా వారిచే లేఖలు రాయించారని ఘర్షణకు దిగారు. తమ పిల్లలపై అనవనరంగా నిందలు మోపారని, చేతులు పట్టుకోవడం లేదా ఒకరి భుజాల మీద ఒకరు చేయి వేయడం స్వలింగ సంపర్కం కాదని తల్లిదండ్రులు పేర్కొన్నారు. బాలికల ఉదంతాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లి వారిని సరైన మార్గంలోకి తీసుకురావడానికే లేఖలు రాయించామని స్కూల్‌ యాజమాన్యం తెలిపింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top