కోరిక తీర్చలేదని చంపేశాడు | killed her because of not to satisfy him | Sakshi
Sakshi News home page

కోరిక తీర్చలేదని చంపేశాడు

Mar 2 2018 7:11 AM | Updated on Jul 30 2018 8:41 PM

killed her because of not to satisfy him - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

దుగ్గొండి(నర్సంపేట): పేదరికాన్ని అలుసుగా తీసుకున్నాడు..స్నేహం చేసి వివాహితను లోబరుచుకున్నాడు.. చివరికి కోరిక తీర్చడానికి నిరాకరించిందని కోపంతో ప్రియుడే అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు.. తొగర్రాయి గ్రామానికి చెందిన నల్ల అనితను హత్య చేసిన నిందితుడు పోలీసులకు గురువారం లొంగిపోయాడు. ఈ మేరకు కేసు వివరాలను దుగ్గొండి సర్కిల్‌ సీఐ బోనాల కిషన్‌ వెల్లడించారు. తొగర్రాయి గ్రామానికి చెందిన కారు అశోక్‌కు ఇదే గ్రామానికి చెందిన నల్ల అనితతో మూడు సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.

ఇదే క్రమంలో గత నెల 25న గ్రామానికి చెందిన కొక్కరకొండ కుమారస్వామి మొక్కజొన్న పంటలో పనులు చేయడానికి అనిత కూలికి వెళ్లింది. ఉదయం 11.30 గంటలకు  అశోక్‌ చేను వద్దకు వెళ్లి అనిత పిలిచాడు. అదే చేనులో శారీరకంగా అనుభవించాడు. అనంతరం ఆమె తెచ్చిన భోజనం తిన్నాడు.  కొంత సేపటికి మళ్లీ కోరిక తీర్చాలని బలవంత పెట్టాడు. అయితే అనిత నిరాకరించింది. కొమ్మాలలో లక్ష్మీనర్సింçహాస్వామి కల్యాణం జరుగుతోంది.. అక్కడికి తనను తీసుకెళ్లి తలంబ్రాలు పోస్తే కోరిక తీరుస్తానని చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య వాదులాట జరిగింది. అనితపై అత్యాచారం చేశాడు. తల వెంట్రుకలు పట్టుకుని నేలకేసి బాదాడు.

దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. చీకటి పడుతుండటంతో చేసేది లేక బాధితురాలి బావ కుమారుడు రాజుకు అనిత మూర్ఛపోయిందని ఫోన్‌ చేశాడు. రాజు మృతురాలి చిన్నకూతురును తీసుకుని చేను వద్దకు వచ్చాడు. అప్పటికే అశోక్‌ ఆటోను పిలిపించాడు. అనితను ఆటోలో ఎక్కించి పరారయ్యాడు. గత నెల 27 తెల్లవారుజామున అనిత మృతి చెందింది. అనంతరం అశోక్‌ గురువారం ఉదయం గిర్నిబావిలో ఆర్‌ఎంపీగా పనిచేస్తున్న నల్ల బాబురావు వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పి పోలీసులకు సరెండర్‌ అయ్యాడు. దీంతో అశోక్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ బోనాల కిషన్‌ తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement