తాలిబన్ల దాడిలో 14మంది విదేశీయులు మృతి | Kabul hotel siege ends after 12 hours with 18 dead, Afghan officials say | Sakshi
Sakshi News home page

తాలిబన్ల దాడిలో 14మంది విదేశీయులు మృతి

Jan 22 2018 3:36 AM | Updated on Mar 28 2019 6:10 PM

Kabul hotel siege ends after 12 hours with 18 dead, Afghan officials say - Sakshi

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో ఇంటర్‌ కాంటినెంటల్‌ హోటల్‌పై  తాలిబన్లు శుక్రవారం రాత్రి జరిపిన దాడిలో 14 మంది విదేశీయులు చనిపోయారు. ఒక టెలికం అధికారి, ముగ్గురు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. 

శుక్రవారం రాత్రి 9.30 ప్రాంతంలో సాయుధులైన నలుగురు దుండగులు హోటల్‌లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ కొందరిని బందీలుగా పట్టుకున్నారు. హోటల్‌లోని కొన్ని గదులకు నిప్పంటించారు. వెంటనే స్పందించిన భద్రతా బలగాలు హెలికాప్టర్‌ ద్వారా భవనం పైనుంచి ప్రవేశించి ఉగ్రవాదులతో తలపడ్డాయి.  మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ ఘటనకు తామే కారణమంటూ ఇస్లామిక్‌ తీవ్రవాద సంస్థ తాలిబాన్‌ ప్రకటించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement