‘ట్విట్టర్‌ కిల్లర్‌’ కు మరణశిక్ష! | Japan 'Twitter killer' faces first murder charge    | Sakshi
Sakshi News home page

‘ట్విట్టర్‌ కిల్లర్‌’ కు మరణశిక్ష!

Nov 20 2017 5:16 PM | Updated on Jul 30 2018 9:21 PM

 Japan 'Twitter killer' faces first murder charge     - Sakshi

సామాజిక వేదిక ట్విట్టర్‌లో పరిచయమైన వారిని నమ్మించి దారుణంగా నరికి చంపిన జపాన్‌కు చెందిన కిల్లర్‌ కు మరణశిక్ష ఖరారైంది.

టోక్యో: సామాజిక వేదిక ట్విట్టర్‌లో పరిచయమైన వారిని నమ్మించి దారుణంగా నరికి చంపిన జపాన్‌కు చెందిన కిల్లర్‌ కు మరణశిక్ష ఖరారైంది. తకహీరో షయిరాయిషి(27) అనే వ్యక్తి బాలికలను, మహిళలను మాయమాటలు చెప్పి తన అపార్టుమెంట్‌కు రప్పించుకుని లైంగికదాడికి పాల్పడేవాడు. వారి వద్ద ఉన్న డబ్బు, ఇతర విలువైన వస్తువులు లాక్కునేవాడు. అనంతరం చంపేసి వారి తల, మొండెం, కాళ్లు, చేతులు.. శరీర భాగాలన్నీ ముక్కలుగా నరికిపడేసేవాడు.

ఈ ఏడాది ఆగస్టు నుంచి ఈ దారుణమారణకాండకు పాల్పడుతున్నాడు. అతని బారిన పడిన వారిలో ఎనిమిది మంది యువతులు, ఒక పురుషుడు ఉన్నారు. హతుల్లో ఒక యువతి తన బాయ్ ఫ్రెండ్ ను వెంటబెట్టుకుని అక్కడికి రాగా తకహిరో అతడి ఉసురు కూడా తీసుకున్నాడు. మహిళల అదృశ్యంపై గత వారం ఫిర్యాదులు అందటంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి రూంలో తలలు, చేతులు, మిగతా, శరీర భాగాలు ఎక్కడపడితే అక్కడ విసిరేసినట్లుగా పడి ఉన్నాయని పోలీసులు చెప్పారు. అంతేకాక దాదాపు 240 ఎముకలు లభ్యమయ్యాయని వారు తెలిపారు.

శరీర భాగాలను డీఎన్ఏ టెస్టుకు పంపిన్టటు  పోలీసులు తెలిపారు. ‘మొదటిసారి హత్య చేసి ఆ డెడ్ బాడీని ముక్కలుగా నరకటానికి మూడు రోజులు పట్టింది... రెండోసారి మాత్రం ఒక్కరోజులో పని పూర్తయింది.’ నిందితుడు పోలీసుల విచారణలో తెలపడంతో పోలీసులకు తెలిపాడు. అయితే, హతులంతా చనిపోవాలనుకుంటున్నారని, వారి కోరిక మేరకు చంపేశానని విచారణలో చెప్పాడని పోలీసులు వెల్లడించారు. ఇప్పటివరకు అతడు ఇద్దరు యువతులను చంపినట్లు అంగీకరించటంతో మరణశిక్ష ఖాయమని పోలీసులు తెలిపారు. మిగతా వారిని ఎలా చంపిందీ పూర్తిగా తెలుసుకునే వరకు విచారణ కొనసాగిస్తామని పోలీసులు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement