ఒంగోలులో దారుణం | husben killed wife in ongole | Sakshi
Sakshi News home page

ఒంగోలులో దారుణం

Oct 24 2017 9:08 AM | Updated on Oct 24 2017 9:20 AM

husben killed wife in ongole

కొర్రపాటి అంజలి (ఫైల్‌),అంజలి మృతదేహాన్ని పరిశీలిస్తున్న తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు

ఒంగోలు క్రైం: ఒంగోలు నగరంలో అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. మంగమూరు రోడ్డులోని రామచంద్ర మిషన్‌ సమీపంలో సోమవారం రాత్రి 10:45 గంటల సమయంలో భార్యని భర్త చంపి పరారైన సంఘటన కలకలం సృష్టించింది. మంగమూరు రోడ్డులో అపార్ట్‌మెంట్‌ కూడలికి చివర ఉన్న ఇంట్లో నివాసం ఉంటున్న కొర్రపాటి అంజలి (33)ని భర్త ఏడుకొండలు అత్యంత కిరాతకంగా హతమార్చాడు. వివరాలు.. తాళ్లూరు మండలం కొర్రపాటివారిపాలెం గ్రామానికి చెందిన ఏడుకొండలు తన కుటుంబంతో కలిసి ఏడాది కిందట బేల్దారి పనులు చేసుకునేందుకు ఒంగోలుకు వచ్చాడు. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడిని చదివించుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నారు.

ఏం జరిగిందో ఏమో కాని సోమవారం రాత్రి భార్యభర్తల మధ్య చోటుచేసుకున్న వివాదంలో ఏడుకొండలు తన భార్య అంజలిని అత్యంత కిరాతకంగా రాయితో నుజ్జునుజ్జు చేసి హతమార్చాడు. సంఘటనను ప్రత్యక్షంగా చూసిన ఇద్దరు కుమార్తెలు భీతిల్లిపోయి విషయాన్ని ఇంటి యజమానులకు తెలిపారు. దీంతో ఏడుకొండలు తన కుమారుడిని బైక్‌పై ఎక్కించుకుని పారిపోయాడు. విషయం తెలుసుకున్న తాలుకా సీఐ గంగా వెంకటేశ్వర్లు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఎస్పీ డి.శ్రీనివాసరావు హత్య జరిగిన ఇంటిని పరిశీలించి అక్కడి నుంచే హత్యకు సంబంధించిన సమాచారం ఎస్పీ సత్య ఏసుబాబుకు ఫోన్‌ ద్వారా అందించారు. పోలీసులు హత్యపై దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement