బూడిదే మిగిలింది! | Four Squatters Burnt | Sakshi
Sakshi News home page

బూడిదే మిగిలింది!

Mar 9 2018 12:47 PM | Updated on Sep 5 2018 9:47 PM

Four Squatters Burnt - Sakshi

ఎగిసిపడుతున్న మంటలు

శ్రీకాకుళం,రేగిడి: మండలంలోని పెద్దలింగాలవలసలో గురువారం రాత్రి 7 గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో నాలుగు పూరిళ్లు దగ్ధమయ్యాయి. రెడ్డి లక్షున్నాయుడు, రెడ్డి రామారావు, పల్లా తవుడమ్మ, లావేటి అప్పన్నలకు చెందిన ఇళ్లు కాలిబూడిదయ్యాయి. లక్షున్నాయుడు ఇంట్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో బాధితులంతా ఆందోళనచెంది బయటకు పరుగులు తీశారు. ఇంతలోనే గాలి వీయడంతో మంటలు చెలరేగి పొరుగున ఉన్న మూడిళ్లకు వ్యాపించడంతో బాధితులంతా కట్టుబట్టలతో పరుగులు తీశారు.

ఈ ఘటనలో పల్లా తవుడమ్మకు చెందిన రూ.20వేలు నగదు కాలిపోయింది. తండ్రీ కొడుకులైన రెడ్డి లక్షున్నాయుడు, రామారావుల రెండిళ్లు కాలిపోవడంతో నిరాశ్రయులయ్యారు. తిండిగింజలు, పాసుబుక్‌లు, విద్యుత్‌ మీటర్లు, డబ్బులు, బంగారం, ఎల్‌ఐసీ బాండ్లు, రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు కాలిపోయాయని బాధితులు వాపోతున్నారు. గ్రామస్తులంతా అప్రమత్తమై మంటలు మరింతగా వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. రాజాం అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి కొంతమేర మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 10 లక్షల ఆస్తి నష్టం ఉంటుందని బాధితులు పేర్కొన్నారు.

దిక్కుతోచని స్థితిలో ఇంటర్‌ విద్యార్థులు
రెడ్డి లక్షున్నాయుడు కుమార్తెలు రెడ్డి మోహిని, రెడ్డి సత్యవతిలు ప్రస్తుతం ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు రాస్తున్నారు. మిగిలిన పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు కాలిపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హాల్‌టికెట్లు, పుస్తకాలు కాలిపోవడంతో పరీక్షలు ఎలా రాయాలో తెలియక ఆవేదన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement