తమిళనాడులో విషాదం | five drowned in sea | Sakshi
Sakshi News home page

సముద్రంలో మునిగి ఐదుగురు మృతి

Jan 16 2018 1:39 PM | Updated on Aug 21 2018 6:02 PM

సాక్షి, చెన్నై : సముద్రంలో ఈతకొడుతూ ఐదుగురు మృతిచెందిన సంఘటన తమిళనాడులో మంగళవారం చోటుచేసుకుంది. నాగపట్టణం జిల్లా వేదారణ్యం సమీపంలోని ఆరుకాట్టుతురై తీరంలో ఈత కొట్టేందుకు ఎనిమిది మంది యువకులు వెళ్ళారు. వేదారణ్యంకు చెందిన ప్రవీణ్‌కుమార్‌, భరత్‌, కనిష్కర్‌, రాజమాణిక్యం, యుగేంద్రన్‌ సముద్రంలో ఈదుతూ లోతుకు వెళ్లడంతో నీటిలో మునిగిపోయారు.

మురో ముగ్గురిని స్థానికులు కాపాడి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తీరప్రాంత గస్తీ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సముద్రంలో మునిగిపోయిన ఐదుగురి మృతదేహాల కోసం గాలింపుచర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement